ఓ నగాదారిలో Madhupriya Bathukamma Song 2022 Madhuppriya Lyrics – Madhuppriya Peddinti
Singer | Madhuppriya Peddinti |
Composer | Krish |
Music | Naveen.J |
Song Writer | Dilip Devgan |
Lyrics
ఓ నగాదారిలో Madhupriya Bathukamma Song 2022 Madhuppriya Lyrics – Madhuppriya Peddinti
O Nagadarilo Bathukamma Song Lyrics in Telugu
అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
(సిన్న పెద్ద సిందులు వేసినరో)
అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
(సిన్న పెద్ద సిందులు వేసినరో)
రామ రామ రామ ఉయ్యాలో
రామునే శ్రీరామ ఉయ్యాల
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరానే ఉయ్యాల
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాల
బామలంతా కూడి ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరి ఉయ్యాల
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నేల వన్నెకాడ ఉయ్యాల
పాపిట్ల సెంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాల
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తరామాస టెన్ టు ఫైవ్ ఉయ్యాల
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాల
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాల
ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
ఆకిలి అలుకుసల్లే గుమ్మడి గుండే సేరే
బంతిపువ్వు బైలెల్లే బతుకమ్మలు అల్లుకునే
మా తల్లి గౌరమ్మా మా ఇంటా కొలువుదీరే
ఓ నగా, అరెరె టెన్ టు ఫైవ్ ఆ నగా
ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
తంగేడు పువ్వు వనములో సిన్నదాని నవ్వులో
ఊరంతా జాతరా పువ్వుల పండుగో
డప్పుళ్ళ సప్పుల్ల గజ్జె మోతరో
బంగరు బొడ్డెమ్మరో బంతిపూలు అల్లెరో
అక్కా సెల్లెల్లా ఆట సూడరో
ఉయ్యాల పాటలే పాడుతున్నరో
సద్దుల బతుకమ్మ సల్లగ మము సూడమ్మా
ఎంగిలి బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ
మా తల్లి గౌరమ్మా మా ఇంట కొలువుదీరే
ఓ నగా, అరెరె ఆ నగా
ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేలా రే రేలా రేలా
ఓ రాగమెత్తే దారిలో రామ నిత్తె దారిలో
బంగారు బతుకమ్మ బైలెల్లెనో
గంగమ్మ సేరే దారి బామలెత్తెనో
ఏలేలు మాతల్లి మా పల్లెల వాడలో
సిత్తూల బతుకమ్మ పండగాయెరో
పచ్చాని పైరులు పరవసించెరో
ఆటల్లా పాటల్లా బతుకమ్మా బైలెల్లే
ఊరంతా కదిలెల్లే గంగమ్మను సేరుకునే
మా తల్లి బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ
ఓ నగా, అరెరె ఆ నగా
ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో